తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ: షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనను రద్దు చేసుకున్నారు హోంమంత్రి అమిత్​ షా. ఆది, సోమవారాల్లో మేఘాలయా, అరుణాచల్​ ప్రదేశ్​ను సందర్శించాల్సిన ఆయన.. కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

amit shah
'పౌర' సెగ ప్రభావం​: షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు

By

Published : Dec 13, 2019, 6:53 PM IST

Updated : Dec 13, 2019, 10:18 PM IST

'పౌర' సెగ: షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు

రెండు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రద్దు చేసుకున్నారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆదివారం పోలిస్​ అకాడమీ పరేడ్​లో పాల్గొనేందుకు షిల్లాంగ్​కు వెళ్లాల్సి ఉంది అమిత్​ షా. ఆ తర్వాతి రోజు అరుణాచల్​ప్రదేశ్​లో తవాంగ్ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమాల్ని షా రద్దు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

తారస్థాయికి నిరసనలు...

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాలను సందర్శించడం సరికాదనే అమిత్ షా పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: పౌర సెగ: ఈశాన్య రాష్ట్రాల్లో దుకాణాల వద్ద జనం బారులు

Last Updated : Dec 13, 2019, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details