భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి అమిత్ షా.. ఈ నెలలో బంగాల్లో పర్యటించనున్నట్టు సమాచారం. సరైన తేదీలను భాజపా వెల్లడించనప్పటికీ.. ఈ నెల 19,20న షా పర్యటన ఉంటుందని తెలుస్తోంది. గురువారం.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రైళ్ల దాడి జరిగిన నేపథ్యంలో.. షా పర్యటనపై వచ్చిన వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
బంగాల్లో 2021 మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో పర్యటించి.. ఎన్నికలు భాజపా సన్నద్ధతను షా సమీక్షించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ నెలలో ఒకసారి బంగాల్లో పర్యటించారు భాజపా మాజీ అధ్యక్షుడు.
మరోవైపు రెండు రోజుల పర్యటన కోసం శనివారం బంగాల్‌కు వెళ్లనున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భాజపా వర్గాల సమాచారం మేరకు.. భాజపా బంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో పాటు ఇతర నేతలతోనూ భేటీకానున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. అయితే ఇవి కేవలం సంస్థాగత సమావేశాలేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.