తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమిత్​ షా'కు అస్వస్థత.. ప్రచారానికి నేడు దూరం - amit shah in haryana

కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హరియాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పాల్గొనాల్సిన మూడు ర్యాలీలను రద్దు చేసుకున్నారు.

'అమిత్​ షా'కు అస్వస్థత... ప్రచారానికి నేడు దూరం

By

Published : Oct 14, 2019, 6:23 PM IST

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్వల్ప అస్వస్థతకు గురికావడం వల్ల హరియాణా ఎన్నికల ప్రచారానికి నేడు దూరంగా ఉన్నారు. ఆయన పాల్గొనాల్సిన మూడు ర్యాలీలను రద్దు చేసుకున్నారు.

సీర్సా నియోజకవర్గంలోని తొహనా, ఫతెహబాద్, ఎల్లెనాబాద్​ సహా హిసార్​ నియోజకవర్గంలోని నర్నౌండ్​లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో అమిత్​ షా ఇందులో పాల్గొనలేకపోతున్నారని భాజపా నేతలు తెలిపారు. అమిత్ షా గైర్హాజరైనందున ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం నర్నౌండ్​ నియోజకవర్గంలో జరిగే ర్యాలీలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

తొహనా నియోజకవర్గం నుంచి హరియాణా భాజపా అధ్యక్షుడు సుభాష్ బరాలా, నార్నౌండ్ నియోజకవర్గం నుంచి అభిమన్యు సింగ్ సింధు పోటీ చేస్తున్నారు. అందువల్ల భాజపా శ్రేణులు ఈ నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details