తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నై మెట్రో 2.0 పనులకు అమిత్ షా శంకుస్థాపన

తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. చెన్నైలోని లీలా ప్యాలెస్​లో జరిగిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్​ను ప్రజలకు అంకితమిచ్చారు.

Amit Shah
అమిత్ షా

By

Published : Nov 21, 2020, 6:09 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రహోమంత్రి అమిత్‌షా రెండు రోజుల పాటు చెన్నైలో పర్యటిస్తున్నారు. లీలా ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన అమిత్ షా.. చెన్నై మెట్రో రెండో దశ పనులకు దృశ్యమాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. తిరువళ్లూరు జిల్లాలో 380 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్​ను ప్రారంభించారు.

మెట్రోను ప్రారంభిస్తున్న షా
మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపన

శనివారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్న అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరిన హోం మంత్రి కారు దిగి నడుచుకుంటూ వెళ్లి కార్యకర్తలకు అభివాదం చేశారు.

అమిత్​ షాకు స్వాగతం
చెన్నై రోడ్లపై షా పాదయాత్ర

గోబ్యాక్​ అంటూ..

ఈ క్రమంలో గోబ్యాక్ అమిత్ షా అంటూ ఓ వ్యక్తి ఫ్లకార్డు విసిరాడు. ఫ్లకార్డు అమిత్‌షాకు 50 మీటర్ల దూరంలో పడగా భాజపా కార్యకర్తలకు అతనికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు అతనిని కొట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

అభిమానులకు షా అభివాదం

రజనీకాంత్​తో భేటీ!

పర్యటనలో భాగంగా రూ.67 వేల కోట్లతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు అమిత్‌షా శంకుస్థాపన చేస్తారు. చెన్నై పర్యటనలో అమిత్‌షా ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌., కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:తమిళనాడుకు అమిత్ ‌షా.. రజనీకాంత్​తో భేటీ!

ABOUT THE AUTHOR

...view details