మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల పర్వం ముగిసింది. హరియాణాలో జేజేపీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. మహారాష్ట్రలో భాజపాకు చుక్కెదురైంది. ఒక పక్క మహా ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. ఝార్ఖండ్ ఎన్నికలకు సిద్ధమవుతోంది కమల దళం. ఈ తరుణంలో ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారాల కోసం అగ్రనేతలు, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపుతోంది భాజపా. తాజాగా వీరికి సంబంధించిన ప్రచార షెడ్యూల్‌ను ఝార్ఖండ్ భాజపా ప్రధాన కార్యదర్శి దీపక్ ప్రకాశ్ వెల్లడించారు.
21న అమిత్‌షా...
నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఝార్ఖాండ్‌లో ఎన్నికలను ఐదు దఫాలుగా జరపాలని నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో మొదటి దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా. ఈ నెల 21న ఝార్ఖండ్‌లోని మణికా, లోహర్‌దగా నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు.
22న గడ్కరీ.. నడ్డా..