పశ్చిమ బంగాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ఆయన పర్యటన వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్. దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
షా పర్యటన రద్దుకు కారణాలేంటో అధికారిక ప్రకటన రాలేదు.
రానున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. భాజపా కీలక నేతలు అక్కడ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా.. రెండు రోజుల పాటు బంగాల్లో పర్యటించాలనుకున్నారు. జనవరి 30, 31 తేదీల్లో రెండు బహిరంగ సభలకు హాజరుకావాల్సి ఉంది.