మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించడాన్ని సమర్థించారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగాల్ విష్ణుపుర్ బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్ షా. మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన విమర్శలకూ గట్టిగా బదులిచ్చారు.
"హరియాణాలోని అంబాలాలో మోదీని ప్రియాంక గాంధీ దుర్యోధనుడు అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మీరంటే దుర్యోధనులు అయిపోరు. మే 23న తేలుతుంది దుర్యోధనుడు ఎవరో.. అర్జునుడు ఎవరో?
రాజ్‌బబ్బర్ మోదీ తల్లి గురించి తప్పుగా మాట్లాడతారు. రాహుల్ గాంధీది అదే తీరు. మోదీ ఉగ్రవాది అని సంజయ్ నిరుపమ్ అంటారు. ఒసామా బిన్ లాడెన్‌తో పోలుస్తారు పవన్ కేడా. విజయ శాంతి అలాగే మాట్లాడతారు. కాకుల్లా అరిస్తే భాజపా భయపడుతుందని అనుకుంటున్నారు వాళ్లు.