తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జకీర్​ నాయక్​పై 'రెడ్​కార్నర్'కు ఆలస్యమెందుకు?​' - రెడ్​కార్నర్​ నోటీసు

మత బోధకుడు జకీర్ నాయక్​పై రెడ్​కార్నర్​ నోటీసుల్లో ఆలస్యంపై ఇంటర్​పోల్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది భారత్​. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో పోరాడాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా సూచించారు.

'జకీర్​ నాయక్​పై 'రెడ్​కార్నర్'కు ఆలస్యమెందుకు?​'

By

Published : Sep 1, 2019, 9:06 AM IST

Updated : Sep 29, 2019, 1:14 AM IST

వివాదాస్పద మత బోధకుడు జకీర్​ నాయక్​పై చర్యలు తీసుకోవటంలో ఆలస్యంపై భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్​పోల్​ ప్రధాన కార్యదర్శి జార్​గెన్​ స్టాక్​తో సమావేశమయిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా... జకీర్​పై రెడ్​కార్నర్​ నోటీసుల జారీపై ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నవారిని శిక్షించాలన్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణ, అంతర్జాతీయ ఉగ్రవాదం, హవాలా వంటి నేరాలపై దీర్ఘకాలిక ప్రణాళికతో పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు షా. ఇలాంటి వాటిని ఏమాత్రం సహించకూడదనే విధానాన్ని అనుసరిస్తున్నామని జార్​గెన్​కు తెలిపారు. పరస్పర సహకారంతోనే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు, ఉగ్రవాదులను పట్టుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

రెడ్​కార్నర్ నోటీసు అంటే...

రెడ్​ కార్నర్ నోటీసును అంతర్జాతీయ అరెస్టు వారెంట్​గా భావిస్తారు. ఈ​ నోటీసు జారీ చేయడం ద్వారా... సభ్య దేశాలు ఆయా నేరస్థులను పట్టుకోవాలని కోరుతుంది ఇంటర్​పోల్.

2022లో ఆతిథ్యం..

2022లో జరగనున్న ఇంటర్​పోల్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించింది భారత్​. 75 స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇంటర్​పోల్​ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్లు జనరల్ జార్​గెన్​తో వెల్లడించారు షా. ఇంటర్​పోల్ గ్లోబల్ అకాడమీకి ప్రాంతీయ హబ్​గా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన సహకారం, మౌలిక సదుపాయాల కల్పన అందిస్తామని సూచించారు.

ఇదీ చూడండి: దళితుల అభ్యుదయానికి మహాత్ముడు చూపిన బాట

Last Updated : Sep 29, 2019, 1:14 AM IST

ABOUT THE AUTHOR

...view details