బిహార్లో జేడీయూ-భాజపా కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు భాజపా సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శనివారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
బిహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-భాజపా మళ్లీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి కాషాయం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవిలో భాజపా అభ్యర్థి ఉంటారా అనే ప్రశ్నకు షా సమాధానమిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలిస్తే నితీశ్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు. ఎన్డీఏ రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు.
"ఎలాంటి అనుమానాలకు తావులేదు. బిహార్ తర్వాతి సీఎం నితీశ్ కుమారే. ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశాం. దానికి మేం కట్టుబడి ఉన్నాం"