కోల్కతాలో కేంద్రహోంమంత్రి అమిత్ షాకు 'పౌర' నిరసన సెగ తగిలింది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు.. సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ) వ్యతిరేక నినాదాలతో స్వాగతం పలికారు నిరసనకారులు. వామపక్షం-కాంగ్రెస్కు చెందిన వందలాది మంది నిరసనకారులు.. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎయిర్పోర్టు ప్రవేశ ద్వారం వైపు ఆందోళనకారులు ప్రవేశించకుండా.. బారికేడ్లను ఏర్పాటు చేశారు