తెలంగాణ

telangana

By

Published : Sep 17, 2020, 6:49 PM IST

Updated : Sep 17, 2020, 7:03 PM IST

ETV Bharat / bharat

నౌకాదళం​ అప్రమత్తతతో చైనా నౌక 'రివర్స్​ గేర్'

గత నెలలో హిందూ మహా సముద్రంలోకి చైనా నౌక ప్రవేశించిందని అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. భారత నౌకాదళం నిరంతరం అప్రమత్తంగా ఉండి, కదలికల్ని పరిశీలించగా... కొద్ది రోజులకు ఆ నౌక వెనుదిరిగినట్లు తెలిపారు.

Amid tensions on border, Indian Navy tracks Chinese research vessel in Indian Ocean
నౌకాదళం​ అప్రమత్తతతో చైనా నౌక రివర్స్​ గేర్

లద్దాఖ్​లో భారత్-చైనా మధ్య వివాదాల నేపథ్యంలో హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన చైనా నౌకపై భారత యుద్ధనౌకలు నిరంతర నిఘా పెట్టి, వెనుదిరిగేలా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఏం జరిగింది?

యువాన్ వాంగ్ అనే చైనా పరిశోధన నౌక గత నెలలో మలక్కా జలసంధి నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ ప్రాంతంలో ఉన్న భారత నావికాదళ యుద్ధనౌకలు చైనా నౌక కదలికలను నిరంతరం పర్యవేక్షించాయి. భారత్​ అత్యంత అప్రమత్తంగా ఉందని గుర్తించిన చైనా నౌక.. కొద్ది రోజుల తర్వాత వెనుదిరిగింది.

కొత్త కాదు

సముద్ర భద్రతకు సంబంధించిన సమాచారం సేకరణ, నిఘా కోసం చైనా నౌకలు అప్పుడప్పుడు ఇలా వస్తుంటాయని అధికారులు తెలిపారు. డిసెంబర్​లోనూ షీ యాన్​-1 నౌక ఇలానే వచ్చిందని గుర్తుచేశారు.

Last Updated : Sep 17, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details