పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను కేటాయించడం సహజం. కరోనా కాలంలో అయితే అనేక జాగ్రత్తలు, నిబంధనలతో బస్సులు నడుపుతాయి. కానీ కేరళ మాత్రం.. ఒక విద్యార్థిని కోసం ఏకంగా 72సీట్లున్న పడవను ఏర్పాటు చేసింది. ఆ ఒక్క విద్యార్థిని కోసం అనేక తంటాలు పడింది. ఎవరా విద్యార్థిని? ఎందుకంత ప్రత్యేకం?
ఆ ఒక్క విద్యార్థినికే ఎందుకు?
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. పరీక్షలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. లాక్డౌన్లో కేంద్రం అనేక సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో.. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యాయి. వాటిలో కేరళ ఒకటి.
అలప్పుజా జిల్లా కుట్టనాడ్ ప్రాంతానికి చెందిన చిన్న ద్వీపంలో 17ఏళ్ల శాండ్రా బాబు అనే విద్యార్థిని నివాసముంటోంది. మే చివరి శుక్ర, శనివారాల్లో కొట్టాయం జిల్లా కంజిరం వద్ద బాలిక ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఏకైక మార్గం పడవ ప్రయాణం. అయితే లాక్డౌన్ కారణంగా అన్ని బోటు సర్వీసులు నిలిపేసింది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టానికి 1.2 నుంచి 3 కిలో మీటర్ల దిగువన ఉన్న ప్రదేశాల్లో కుట్టనాడ్ ఒకటి.
శాండ్రా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. తమ కుమార్తెను పరీక్షలకు ఎలా తీసుకెళ్లాలో తెలియక సతమతమయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర జల రవాణా శాఖ(కేఎస్డబ్ల్యూటీడీ)ను సంప్రదించారు. విద్యార్థిని పరిస్థితి చూసి సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు కేఎస్డబ్ల్యూటీడీ డైరెక్టర్ షాజీ వీ నాయర్ తెలిపారు.
కానీ సమస్యేమిటంటే!