ఈశాన్య దిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. ఆందోళనకారులు వీధుల్లోని దుకాణాలు లక్ష్యంగా రాళ్లదాడికి దిగారు. ఓ బేకరీ, పండ్ల దుకాణాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎక్కడికక్కడ పారామిలిటరీ దళాలను మోహరించారు.
నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడడం వల్ల ఈశాన్య దిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. అడ్డుకుంటోన్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు.