నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజైన విజయదశమిని.. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో.. రావణ దహనాలు వంటి కార్యక్రమాలు లేకుండానే నిరాడంబరంగా పండుగను జరుపుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఇలా..
అసోంలోని ధుబ్రిలో ఔషధాలను ఉపయోగించి సంజీబ్ బసక్ అనే ఓ ఔత్సాహికుడు దుర్గాదేవి ప్రతిమను రూపొందించారు. గడువు ముగిసిన మాత్రలను, ఔషధాలను ఉపయోగించి ఆరడుగుల అమ్మవారి విగ్రహాన్ని తయారుచేశారు. విగ్రహం తయారీకి 5 నెలల సమయం పట్టిందన్న సంజీబ్.. 40వేల వరకూ మాత్రలు, ఇంజెక్షన్ వయల్స్, క్యాప్సుల్స్ ఉపయోగించినట్లు తెలిపారు.
- ఒడిశాలోని గంజాంలో ఓ ఔత్సాహికుడు అతి సూక్ష్మ పరిమాణంలో దుర్గాదేవి ప్రతిమను తయారుచేసి రికార్డు సృష్టించాడు.
- విజయదశమిని పురస్కరించుకుని పలుచోట్ల ఏర్పాటుచేసిన బొమ్మల కొలువులు సైతం ఆకట్టుకుంటున్నాయి.
- గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని.. దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. గోరఖ్పూర్ మఠంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పీఠాధిపతి హోదాలో దుర్గా పూజ నిర్వహించారు.
ఇదీ చూడండి:-సకల సృష్టికి మూలం విజయ విలాసిని!