భాజపా 'ఆట ముగిసే సమయం ఆసన్నమైంది' అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్రానికి రాజకీయ వెర్షన్‌ను ట్విట్టర్లో పంచుకున్నారు.
"గత ఐదేళ్లలో, భాజపా ప్రజాస్వామ్య మూలస్తంభాలను కూల్చివేసింది. ఇప్పుడు ఆ పార్టీ ఆట ముగిసే సమయం ఆసన్నమైంది. (ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్) మహాకూటమి ప్రభుత్వం త్వరలో ఏర్పడబోతోంది." - అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ట్వీట్