తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమేఠీలో స్మృతి ఇరానీ మద్దతుదారు హత్య - అమేఠీ

ఉత్తరప్రదేశ్​లోని అమేఠీకి చెందిన బరౌలియ గ్రామ మాజీ పెద్ద సురేంద్ర సింగ్​ను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు.  ఇటీవలే ఎంపీగా ఎన్నికైన భాజపా నేత స్మృతి ఇరానీకి ఆయన మద్దతుదారుడని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్​ మద్దతుదారులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు సురేంద్ర సింగ్​ కుమారుడు.

అమేఠీలో స్మృతి ఇరానీ మద్దతుదారుడి హత్య

By

Published : May 26, 2019, 11:37 AM IST

Updated : May 26, 2019, 1:09 PM IST

అమెఠీ బరౌలియలో ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్​లోని అమేఠీలో ఎంపీ స్మృతి ఇరానీ మద్దతుదారుడు, భాజపా నాయకుడైన సురేంద్ర సింగ్​ను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన అమేఠీ జిల్లాలోని బరౌలియ గ్రామంలో జరిగింది. శనివారం అర్ధరాత్రి హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు గాయాలపాలైన సురేంద్ర సింగ్​ను గుర్తించి లఖ్​నవూ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్ర మృతిచెందారు.

సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ లోక్​సభ స్థానం నుంచి స్మృతి ఇరానీ చరిత్రాత్మక విజయం అందుకున్న కొన్ని రోజులకే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు అధికారులు.

పోలీసుల అదుపులో ఇద్దరు

ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సురేంద్ర సింగ్​ హత్యపై ఆయన కుమారుడు స్పందించాడు. కాంగ్రెస్​ మద్దతుదారులపై అనుమానాలు ఉన్నట్టు తెలిపాడు.

"ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. స్మృతి ఇరానీకి మా నాన్న మద్దతుదారుడు. ఎన్నికల సమయంలో ఆయన తినడానికి మాత్రమే ఇంటికి వచ్చేవారు. మిగతా సమయం ప్రచారాల్లో పాల్గొనేవారు. రాహుల్​ గాంధీపై స్మృతి ఇరానీ గెలవడం వల్ల ప్రాంతం అంతటా సంబరాలు జరిగాయి. మా గ్రామంలో విజయ యాత్ర నిర్వహించారు. ఈ విషయం కొంత మంది కాంగ్రెస్​ మద్దతుదారులకు నచ్చలేదని మేం అనుకుంటున్నాం. వారిలో ఈర్ష్య పెరిగింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కొందరిపై అనుమానాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో నిజాలు తెలియాలి."

--- సురేంద్ర సింగ్​ కుమారుడు

సురేంద్ర హత్యపై ఎస్పీ స్పందించారు. అన్ని కోణాల్లోనూ... ముఖ్యంగా రాజకీయ హత్య కోణంలో విచారణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్​పై తీవ్ర ఆరోపణలు చేశారు అమేఠీ లోక్​సభ భాజపా కన్వీనర్ రాజేశ్​ అగ్రహారి. హస్తం పార్టీ ఘోర వైఫల్యం చవిచూసిన తరుణంలో స్మృతి ఇరానీ మద్దతుదారుడి హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి- సినీడైరీ: ఈ కుక్కలా ఒక్కరోజు బతికినా చాలు!

Last Updated : May 26, 2019, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details