ఆప్ ప్రభుత్వం దిల్లీ పాఠశాలల్లో ప్రారంభించిన సంతోష తరగతులను మెలనియా ట్రంప్ సందర్శించే కార్యక్రమంలో పాల్గొనేందుకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియాలకు అనుమతి లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.
'అక్కడికి కేజ్రీవాల్ వస్తే మాకు అభ్యంతరం లేదు' - కేజ్రీ హాజరుపై అభ్యంతరం లేదు: అమెరికా
దిల్లీలో ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన సంతోష తరగతులను అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రేపు సందర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రికి ఆహ్వానం అందలేదు. కానీ కేజ్రీవాల్ హాజరైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది అమెరికా రాయబార కార్యాలయం.
కేజ్రీ హాజరుపై అభ్యంతరం లేదు: అమెరికా
ఈ అంశంపై సిసోడియా స్పందిస్తూ.. మెలానియా రాక తమకు గర్వకారణమన్నారు. అమెరికా రాయబార కార్యాలయం వెలిబుచ్చిన ఆందోళనలను తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. కేజ్రీ, సిసోడియా హాజరుపై తమకు అభ్యంతరం లేదంటూనే ఈ కార్యక్రమం రాజకీయపరమైనది కాదని వారు గుర్తించారని అభినందించింది.
ఇదీ చదవండి:నైపుణ్యం పెట్టుబడిగా పెట్టు.. ఆన్లైన్లోనే ఉపాధి పట్టు
Last Updated : Mar 2, 2020, 9:07 AM IST