అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి రక్షణను పర్యవేక్షించే భద్రతా దళం అహ్మదాబాద్‌కు చేరుకుంది. అమెరికా వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం ద్వారా ఈ బలగాలు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన ప్రత్యేక అధికారుల బృందం మొతెరా స్టేడియాన్ని ఆదివారంసందర్శించింది. స్నైపర్లు, జామర్లు, రహస్య కెమెరాలతో కూడిన ప్రత్యేక బలగాలు ట్రంప్ పర్యటించే ప్రదేశాలను జల్లెడ పడుతున్నాయి. పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వానికి చెందిన నెంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనాలను అహ్మదాబాద్ వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అహ్మదాబాద్‌కు 'అధ్యక్షుడి' రక్షణ బృందం - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ 24 నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి భద్రతాబృందం అగ్రరాజ్య వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం ద్వారా అహ్మదాబాద్‌కు చేరుకుంది. ట్రంప్ పర్యటించే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అహ్మదాబాద్‌కు చేరుకున్న అధ్యక్షుడి బందోబస్తు!
ట్రంప్‌కు రక్షణగా దేశీయ ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమెండోలు, యూఎస్ సీక్రెట్ సర్వీస్ గార్డ్లు, స్థానిక పోలీసులు పనిచేయనున్నారు. అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా తాజ్ సర్కిల్, షాహీభాగ్ దుఫనాలా, గాంధీ ఆశ్రమాలను సందర్శిస్తారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయా స్థలాల్లో ఇప్పటినుంచే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.
Last Updated : Mar 1, 2020, 3:34 PM IST