తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మ, నాన్న... ఓ 'పాకిస్థానీ' శిశువు! - pakistani birth certificate in gujrat

గుజరాత్​లో ఓ మున్సిపల్ కార్పొరేషన్​ నిర్లక్ష్యం.. భారత్​లో పుట్టిన శిశువును పాకిస్థానీని చేసింది. జనన ధ్రువీకరణ పత్రంలో తప్పుడు చిరునామా జత చేసి.. కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

AMC birth death registration department describe pakistan in address of birth certificate
అమ్మ... నాన్న... ఓ 'పాకిస్థానీ' శిశువు!

By

Published : Feb 10, 2020, 8:19 AM IST

Updated : Feb 29, 2020, 8:02 PM IST

ఇప్పటికే దేశంలో పౌరసత్వ చట్టం... జాతీయ పౌర జాబితా అంశాలపై భారతీయుల్లో ఆందోళన నానాటికి పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మీ జనన ధ్రువీకరణ పత్రంలో చిరునామా 'పాకిస్థాన్ ' అని రాసి ఉంటే..?​ ఊహించుకోడానికే భయంగా ఉంది కదూ! గుజరాత్​ అహ్మదాబాద్​లో మున్సిపల్​ అధికారుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే తెచ్చిపెట్టింది.

పత్రం చూసి పరేషాన్​..

అర్బజ్​ఖాన్​ పాతన్​, మహెక్​బాను పాతన్ దంపతులు వాత్వా రైల్వై క్రాసింగ్​ సమీపంలోని చర్మాలియా సొసైటీలో నివసిస్తున్నారు.​ 2018 అక్టోబర్​ 1న వీరికి కుమారుడు జన్మించాడు. మహ్మద్​ ఉజర్​ఖాన్​గా నామకరణం చేశారు. ఇప్పుడు ​ఉజర్ వయసు 18 నెలలు.​ నానమ్మ షాలేహా బీబీ పాతన్ ఈ నెల 3న ఉజర్​ జనన ధ్రువీకరణ పత్రాన్ని సేకరించింది. పత్రాన్ని చూసిన కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు.

అమ్మ... నాన్న... ఓ 'పాకిస్థానీ' శిశువు!

అహ్మదాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్​ (ఏఎంసీ) జారీ చేసిన ఆ పత్రంలో.. చిరునామా గడిలో.. "పాకిస్థాన్​ రైల్వే స్టేషన్​ పక్కన.. "అని రాసి ఉండడం చూసి అవాక్కయ్యారు. తల్లిదండ్రలు భారతీయులైనప్పుడు.. కుమారుడు పాకిస్థాన్​కు చెందినవాడెలా అవుతాడని విస్తుపోయారు.

అనధికారిక నామం..

వాత్వా రైల్వే క్రాసింగ్‌లో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని అనధికారికంగా "పాకిస్థాన్ క్రాసింగ్", "చోటా పాకిస్థాన్" అని పిలుస్తుంటారు స్థానికులు. ఇక్కడ సుమారు 2,200 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతం అధికారిక నామం "వసంత గజేంద్రగడ్కర్ నగర్ ఇడబ్ల్యూఎస్ హౌసింగ్". అయితే ఈ సంగతి తెలిసి కూడా.. అధికారులు అంత నిర్లక్ష్యంగా శిశువు జనన ధ్రువీకరణ పత్రంలో తప్పుడు చిరునామ ఎలా రాస్తారని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు.

ఇదీ చదవండి:పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన కల్కి కొచ్చిన్​!

Last Updated : Feb 29, 2020, 8:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details