కేరళ మలప్పురానికి చెందిన ఓ యువకుడు నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. తన సహృదయంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మనసు గెలుచుకున్నాడు.
మలప్పురం జిల్లా ఈదరికోడ్ గ్రామానికి చెందిన నబీల్.. తన సోదరి ఆన్లైన్ క్లాసుల కోసం రూ.1400 ఖర్చు చేసి ఓ పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశాడు. వారం రోజుల్లోనే డెలివరీ చేసింది అమెజాన్. ప్యాక్ తెరిచి చూస్తే అందులో పవర్ బ్యాంకుకు బదులు రూ. 8000 ఖరీదైన రెడ్ మీ 8A ఫోన్ కనిపించింది. అయితే, నబీల్ అందరిలాగా ఎగిరిగంతేసి ఆ ఫోన్ దాచేసుకోలేదు. పవర్ బ్యాంక్ బదులు పొరపాటున ఫోన్ డెలివరీ చేశారనీ.. ఆ మొబైల్‌ను ఫొటో తీసి, అమెజాన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.