తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూన్​ 23 నుంచి అమర్​నాథ్​ యాత్ర

అమర్​నాథ్ యాత్ర తేదీలను ప్రకటించింది ఆలయ ట్రస్ట్​ బోర్డు. ​జూన్​ 23న యాత్ర ప్రారంభంకానుండగా.. ఏప్రిల్​ 1 నుంచి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సంవత్సరం 42 రోజుల పాటు యాత్ర సాగుతుందని పేర్కొంది ట్రస్ట్​.

Amarnath Yatra begins from June 23
జూన్​ 23 నుంచి అమర్​నాథ్​ యాత్ర

By

Published : Feb 16, 2020, 6:28 AM IST

Updated : Mar 1, 2020, 12:01 PM IST

జూన్​ 23 నుంచి అమర్​నాథ్​ యాత్ర

మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది మొత్తం 42 రోజులు కొనసాగనుంది. కశ్మీర్ దక్షిణ హిమాలయాల్లోని ఈ యాత్రను జూన్ 23న ప్రారంభించబోతున్నట్లు అమర్‌నాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డ్ ప్రకటించింది.

రెండు రోజులు ఆలస్యంగా..

గతేడాది జూన్ 21న ఈ యాత్ర ప్రారంభం కాగా... ఈసారి రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. 2019లో ఈ యాత్ర 60 రోజులు సాగగా... ఈసారి 42 రోజుల్లోనే ముగించనున్నారు. గతేడాది ఉగ్ర దాడులు జరగవచ్చనే అనుమానంతో... ఆగస్ట్ 2న అమర్‌నాథ్ యాత్రికుల్ని హడావిడిగా జమ్ము నుంచి తరలించారు. తీవ్ర నిరాశతో పెద్ద సంఖ్యలో భక్తులు వెనుదిరిగారు.

ఏప్రిల్​ 1 నుంచి రిజిస్ట్రేషన్​..

యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ఏప్రిల్ 1 నుంచి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2019లో కేంద్రం కొంత మంది భక్తులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈసారి మరింత ఎక్కువ మందికి ఈ సదుపాయం కల్పించాలని భావిస్తోంది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు... 75 ఏళ్లు దాటిన వారిని ఈ యాత్రకు అనుమతించరు. యాత్ర మార్గంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించారు.

ఇదీ చూడండి: ప్రపంచానికి యోగా నేర్పించనున్న భారతీయుడు!

Last Updated : Mar 1, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details