తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జులై 21 నుంచి అమర్​నాథ్​ యాత్ర.. ఇవి తప్పనిసరి! - TEMPLE

కరోనా లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో.. ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర జులై 21 నుంచి ప్రారంభం కానుందని ఆలయవర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 3వ తేదీ వరకు యాత్ర సాగనుంది. అయితే.. ఈ సారి యాత్ర 14 రోజులకే పరిమితం కానున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.

Slug Amarnath Yatra 2020 to begin on July 21 till August 3
జులై 21 నుంచి అమర్​నాథ్​ యాత్ర.. ఇవి తప్పనిసరి!

By

Published : Jun 6, 2020, 12:24 PM IST

మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జులై 21 నుంచి ప్రారంభం కానుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 3వ తేదీ వరకు యాత్ర సాగనుంది.

అయితే.. మొత్తం 42 రోజులు కొనసాగనున్న యాత్ర లాక్‌డౌన్‌ కారణంగా ఈ సారి 14 రోజులకే పరిమితం కానుంది. ఈ మేరకు అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు అధికారులు వెల్లడించారు.

యాత్ర తొలి పూజను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ఇప్పటికే ప్రారంభంకావాల్సి ఉండగా కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సాధ్యం కాలేదు. సాధువులను మినహాయించి 55 ఏళ్లు దాటిన భక్తులకు అమర్‌నాథ్‌ యాత్రకు అనుమతి లేదు.

వైరస్​ లేకుంటేనే...

యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు కరోనా వైరస్‌ లేదని వైద్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. యాత్రను ప్రారంభించడానికి జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించక ముందే ఈ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details