సరిహద్దులకు సంబంధించి రక్షణ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'భారత్, చైనా ప్రతిష్టంభన: జవాబుదారీతనం, సంస్కరణల కోసం కేంద్రానికి 144 మంది మాజీ సైనికుల లేఖ' అనే వార్తా కథనాన్ని జోడిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు రాహుల్.
"భారత భూభాగాన్ని చైనా ఆక్రమించకుండా కేంద్రం తీసుకున్న చర్యలను దేశ ప్రజలకు తెలియజేయాలి. సరిహద్దులకు అంశాలకు సంబంధించి రక్షణ అనుభవజ్ఞుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. చైనా చొరబాట్లు, ఆక్రమణలను గుర్తించేందుకు స్వతంత్ర నిజనిర్ధరణ కమిటీని నియమించాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత