తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే.. సీఎంగా సోరెన్​'

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్​ ఉంటారని ప్రకటించింది.

CONG-SOREN
CONG-SOREN

By

Published : Dec 23, 2019, 3:17 PM IST

ఝార్ఖండ్​లో జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆధిక్యం వైపు దూసుకెళ్తోన్న కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్​ ఉంటారని చెప్పింది.

ఈ మేరకు ఝార్ఖండ్​ ఏఐసీసీ ఇన్​ఛార్జి ఆర్​పీఎన్​ సింగ్​ ప్రకటన చేశారు.

"ప్రజల సమస్యలను లేవనెత్తుతూ ఎన్నికల్లో పోరాడాం. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ-షా ద్వయం ప్రయత్నించింది. కానీ ప్రజలు ఆ మాయలో పడలేదు."

-ఆర్​పీఎన్​ సింగ్​, ఝార్ఖండ్ ఏఐసీసీ ఇన్​ఛార్జి

ఈ ఫలితాలతో భాజపా అవినీతి, ఆ పార్టీ గర్వం ఓడిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త అజయ్​ శర్మ అభిప్రాయపడ్డారు.

"భాజపా అవినీతిపరులకు టికెట్లు ఇచ్చింది. ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. సామాన్యుడి సమస్యలు తీర్చడంలో భాజపా విఫలమైందని నిరూపించగలిగాం."

-అజయ్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త

ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 28 స్థానాల్లో ముందంజలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details