మతం పేరిట ఒక జంటను విడదీయలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
మతాంతర వివాహం తప్పేమీ కాదు: హైకోర్టు
మతంతో సంబంధం లేకుండా ఒక మహిళ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మతాంతర వివాహం చేసుకున్న జంటకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
మతాంతర వివాహం తప్పేమీ కాదు: అలహాబాద్ హైకోర్టు
తన కుమార్తెను ఎత్తుకెళ్లి, బలవంతంగా మతాంతర వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక వ్యక్తి(యువతి తండ్రి) కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పంకజ్ నక్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం వయోజనురాలైన యువతికి తన జీవత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని ఉద్ఘాటించింది. యువతి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆమె భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది.