కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్. ఈ ప్రాణాంతక మహమ్మారి ఇప్పటివరకు దాదాపు 114 దేశాలకు వ్యాపించింది. లక్షా 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనా, ఇటలీ, ఇరాన్ దేశాల్లో వేలాదిమంది మృత్యువాత పడ్డారు.
విదేశాలతో పాటు కరోనా బారిన పడ్డవారి సంఖ్య భారత్‌లోనూ అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 114 మందికి ఈ మహమ్మారి సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. కర్ణాటక, దిల్లీలో మొత్తం ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేసింది కేంద్రం.
ఇందులో భాగంగా బ్రిటిష్ హయాంనాటి అంటు వ్యాధుల చట్టం-1897లోని సెక్షన్ 2ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని ఈనెల 11న సూచించారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి. వెంటనే ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.
అంటు వ్యాధుల చట్టం ప్రకారం కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని బలవంతంగానైనా ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుంది.
గతంలో ఎప్పుడెప్పుడు అమలు చేశారు?
బ్రిటిష్‌వారి కాలంలో బాంబే రాష్ట్రానికి ప్లేగు వ్యాధి సంక్రమించినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ అంటు వ్యాధుల చట్టం-1897ను అమలు చేశారు.
ఆ తర్వాత దేశంలోకి పలు ప్రాణాంతక వ్యాధులు అడుగుపెట్టినప్పుడు ఈ చట్టాన్ని వినియోగించారు.
2018లో గుజరాత్లో కలరా వ్యాప్తి చెందినప్పుడు, 2015లో చండీగఢ్‌లో డెంగీ, మలేరియాను నియంత్రించేందుకు, పుణెలో 2009లో స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు ఈ అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చారు.
ఈ చట్టం నిబంధనలు ఏమిటి?
ఈ చట్టంలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఇందులో