చంద్రయాన్-2: తెలుసుకోవాల్సిన విషయాలు మరికొన్ని గంటల్లో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపనుంది. ఇంతకుముందు ఏ దేశమూ చేరుకుని చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగేందుకు చంద్రయాన్-2 సిద్ధమయింది. ఈ మిషన్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు మీ కోసం..
చంద్రయాన్ మిషన్ బడ్జెట్
- చంద్రయాన్-2 మొత్తం ఖర్చు రూ. 978 కోట్లు
- మిషన్ ఖర్చు రూ. 603 కోట్లు
- ప్రయోగ ప్రారంభ ఖర్చు రూ. 375 కోట్లు
చంద్రయాన్-1 ప్రస్థానం
- 1999: ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశంలో చంద్ర మండల యాత్రకు ప్రతిపాదన
- 2003 ఆగస్టు 15: చంద్రయాన్ కార్యక్రమాన్ని ప్రకటించిన ప్రధాని వాజ్‌పేయీ
- 2008 అక్టోబర్ 22: చంద్రయాన్-1 ప్రయోగం
- 2008 నవంబర్ 8: భూకక్ష్యను వీడి చంద్రుడి పథంవైపు పయనం
- 2008 నవంబర్ 14: దక్షిణ ధ్రువం సమీపంలో కూలిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
- 2009 ఆగస్టు 28: ముగిసిన చంద్రయాన్-1 ప్రస్థానం.. పూర్తిగా తెగిన సంబంధం
చంద్రయాన్-2 ప్రస్థానం
- 2007: చంద్రయాన్-2 కోసం రష్యాతో భారత్ ఒప్పందం
- 2011: నిర్దేశిత సమయంలో ల్యాండర్‌ను అందివ్వలేమని వెనక్కితగ్గిన రష్యా
- 2013: స్వతంత్రంగా రూపొందించుకోవాలని భారత్ నిర్ణయం
- 2019 జులై 22: నింగికెగిసిన చంద్రయాన్-2
- 2019 సెప్టెంబర్ 2: ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్
- 2019 సెప్టెంబర్ 7: జాబిల్లి ఉపరితలంపై మృదువుగా దిగనున్న విక్రమ్
చంద్రయాన్-2 హైలైట్స్
- చంద్రయాన్-1కు కొనసాగింపే చంద్రయాన్-2
- చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు సాగిన తొలి ఉపగ్రహంగా ఘనత
- సాఫ్ట్ ల్యాండింగ్‌లో నాలుగో దేశంగా రికార్డు
- పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన మిషన్
- చంద్రయాన్-2 బృందంలో 30 శాతం మంది మహిళలే
- ఇద్దరు మహిళల నేతృత్వంలో భారత తొలి గ్రహాంతర ప్రయోగం
- ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. వనిత, మిషన్ డైరెక్టర్ రీతూ కరిధాల్
- రోవర్‌లోని ఓ చక్రంపై అశోక చక్ర చిహ్నం ముద్రణ
- ల్యాండర్ ర్యాంపుపై జాతీయ పతాకం ఏర్పాటు
- సంవత్సరంపాటు కొనసాగనున్న ఆర్బిటర్ పరిశోధన
- చంద్రుని ఉపరితలంపై 14 రోజులు ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు
మిషన్ లక్ష్యాలు
- చందమామ ఉపరితలంపై సున్నితంగా ల్యాండ్ చేయడం
- చంద్రుడి ఉపరితలం, ఐనో ఆవరణంపైనా పరిశోధనలు
- జాబిల్లిపై ఖనిజాల గుర్తింపుపై ప్రయోగాలు
- నీటి ఆనవాళ్ల కోసం విశ్లేషణ
ఇదీ చూడండి: చంద్రయాన్-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు