తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీకి ఊరట- ఆ మార్కెట్​లో బర్డ్​ ఫ్లూ లేదంట! - మహారాష్ట్రలో బర్డ్​ఫ్లూ

దిల్లీలోని ఘాజీపుర్​ పౌల్ట్రీ మార్కెట్​లో సేకరించిన నమూనాల్లో.. బర్డ్​ఫ్లూ నెగెటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 100 నమూనాలను పరీక్షించగా.. అన్నింటికీ నెగెటివ్​గా నిర్ధరణ అయినట్లు చెప్పారు.

Ghazipur chicken market
ఘాజీపుర్ మార్కెట్​​ నమూనాల్లో బర్డ్​ఫ్లూ నెగెటివ్​

By

Published : Jan 14, 2021, 2:24 PM IST

ఆసియాలోనే అతిపెద్ద చికెన్​ మార్కెట్​గా పేరుగాంచిన దిల్లీలోని ఘాజీపుర్​ పౌల్ట్రీ మార్కెట్​లో బర్డ్​ఫ్లూ లేదని తేలింది. ఈ మార్కెట్​ నుంచి సేకరించిన 100 నమూనాలను పరీక్షల కోసం జలంధర్​లోని ప్రయోగశాలకు పంపారు. ఫలితాల్లో అన్నింటికీ నెగెటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు గురువారం తెలిపారు.

అయితే.. హాస్ట్​సల్​ పార్కులో సేకరించిన మరో నాలుగు హెరాన్​ పక్షుల్లో ఇన్​ఫ్లూయెంజా వైరస్​ ఆనవాళ్లు కనిపించగా.. వాటిని నిర్ధరించడానికి భోపాల్​కు పంపినట్లు అధికారులు చెప్పారు.

బర్డ్​ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలోని దిల్లీలోని ఉత్తర, దక్షిణ, తూర్పు.. మొత్తం మూడు నగర పాలికల్లోనూ పౌల్ట్రీ ఉత్పత్తుల, విక్రయాలు, నిల్వలపై దిల్లీ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.

మహారాష్ట్రలో 3,400కు పైగా కోళ్లు ఖననం...

మహారాష్ట్రలోని పర్​భాణీ జిల్లాలో 3,400 కు పైగా కోళ్లను అధికారులు ఖననం చేశారు. అక్కడ వందలాది సంఖ్యలో మృతి చెందిన కోళ్లకు వైరస్​ సోకినట్లు తేలగా.. ఈ చర్యలు తీసుకున్నట్లు ఓ సీనియర్​ అధికారి చెప్పారు.

పర్​భాణీలోని మురుంబాలో గతవారం 900 కోళ్లు మృతి చెందాయి. దాంతో బుధవారం రాత్రి వరకు 3,433 పక్షులను ఖననం చేసినట్లు జిల్లా కలెక్టర్​ దీపక్​ ముగ్లీకర్​ తెలిపారు.

అంతకుముందు బర్డ్​ ఫ్లూ నియంత్రించడానికి లాతుర్​ జిల్లా కేంద్రేవాడి, సుక్నీ గ్రామాల్లో 11,000 పక్షులను ఖననం చేశారు. బర్డ్​ఫ్లూ కారణంగా మహారాష్ట్రలో జనవరి 8 నుంచి 2,000కు పైగా పక్షులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం వద్దు: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details