గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ రూపొందించిన "వైష్ణవ జన తో" గీతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్లో ఆవిష్కరించిన ఈ గీతానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈటీవీ భారత్ కృషిని ట్విట్టర్ వేదికగా కొనియాడారు. గాంధీ భావాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారని అభినందించారు.
"పూజ్యులైన బాపూను స్మరిస్తూ అద్భుతమైన భజన గీతాన్ని స్తుతించినందుకు ఈటీవీ భారత్‌కు హార్దిక అభినందనలు. గాంధీ కలలు సాకారం అవ్వడానికి, స్వచ్ఛభారత నిర్మాణానికి మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి భారత్‌కు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. దేశంలోని అన్ని భాషల గాయకులతో రూపొందించిన గీతం అద్భుతంగా ఉందని కొనియాడారు.
"మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ.. ‘వైష్ణవ జన తో'’ వీడియోను రూపొందించిన ఈటీవీ భారత్‌కు అభినందనలు. దేశవ్యాప్తంగా కళాకారులు ఈ వీడియోలో తమ గాత్రాన్ని అందించడం ప్రశంసనీయం."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారతదేశంలోని అత్యుత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు.
" గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" భజన గీతం అందరిని ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్లో ఆవిష్కరించిన ఈ గీతాన్ని విన్న రాజకీయ నేతలు ప్రశంసిస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారత్లోని ఉత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు."