తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​డీఏ- నితీశ్​కు మధ్య ఇబ్బందులు లేవు'

బిహార్​లో ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు కేంద్రమంత్రి, ఎల్​జేపీ అధినేత రామ్​ విలాస్​ పాసవాన్​. ముఖ్యమంత్రి నితీశ్​కుమారే తమ నాయకుడని స్పష్టం చేశారు.

'ఎన్​డీఏ- నితీశ్​కు మధ్య ఇబ్బందులు లేవు'

By

Published : Jun 3, 2019, 5:42 AM IST

బిహార్​లో ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బందులు లేవు

బిహార్​లో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్రమంత్రి, ఎల్​జేపీ అధినేత రామ్​విలాస్​ పాసవాన్​ స్పందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కూటమికి ముఖ్యమంత్రి నితీశ్​ కుమారే నాయకుడని స్పష్టం చేశారు.

"ఎన్డీఏలో ఇబ్బందులు లేవు. నితీశ్​ కుమార్​ మా నాయకుడు. దీనిపై ఎక్కువ ఆలోచనలు అనవసరం. ఎన్డీఏ కూటమితోనే ఉంటామని ఆయనే (నితీశ్​ కుమార్​) చెప్పారు. అంతేకాక బంధాన్ని బలోపేతం చేయడానికి నేను ఉన్నాను. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత శక్తిమంతమైన నాయకుడు. ఎన్డీఏతోనే ఉంటామని స్పష్టంగా చెప్పినప్పుడు సమస్య ఎక్కడుంది?"

- రామ్​ విలాస్​ పాసవాన్​, కేంద్ర మంత్రి.

బిహార్​లోమంత్రివర్గాన్ని ఆదివారంవిస్తరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. జేడీయూకి చెందిన 8 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మిత్రపక్షమైన భాజపాకు మంత్రివర్గంలో చోటిచ్చినా... ఆ పార్టీ నేతలు చేరలేదు. అయితే... కమలదళంతో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు నితీశ్​.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details