తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో అమిత్​ షా సెమినార్​- ఎన్​ఆర్​సీపై ప్రకటన!

బంగాల్​ రాజధాని కోల్​కతాలో జాతీయ పౌర జాబితాపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేడు సెమినార్​ నిర్వహించనున్నారు. బంగాల్​లో ఎన్​ఆర్​సీ చేపడతామనే ప్రకటనల నేపథ్యంలో నేటి సెమినార్​కు ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగాల్​లో అమిత్​ షా సెమినార్​- ఎన్​ఆర్​సీపై ప్రకటన!

By

Published : Oct 1, 2019, 5:02 AM IST

Updated : Oct 2, 2019, 5:00 PM IST

బంగాల్​లో అమిత్​ షా పర్యటన

బంగాల్​ కోల్​కతాలో నేడు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పర్యటించనున్నారు. కోల్​కతా వేదికగా వివాదాస్పద జాతీయ పౌర జాబితా చట్ట సవరణ-2019పై సెమినార్​ నిర్వహించనున్నారు. అసోం తరహాలో బంగాల్​లోనూ ఎన్​ఆర్​సీని చేపడతామన్న ప్రకటనల నేపథ్యంలో షా సెమినార్​పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సెమినార్​లో ఏం చెప్పబోతున్నారు. ఏదైనా ప్రకటన ఉంటుందా అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బంగాల్​లో పర్యటిస్తున్నారు షా. ముందుగా కోల్​కతాలోని ఓ కమ్యూనిటీ నిర్వహిస్తోన్న దుర్గా పూజలో పాల్గొననున్నారు. అనంతరం సెమినార్​కు హాజరవుతారు.

ఇటీవల అసోంలో విడుదలైన ఎన్​ఆర్​సీ తుది జాబితాలో సుమారు 19 లక్షల మందికి చోటు లభించలేదు. అందులో హిందూ బెంగాలీలు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయంతోనే బంగాల్​లో ఇప్పటి వరకు సుమారు 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో షా సెమినార్​ నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్​ఆర్​సీపై టీఎంసీ పార్టీ సృష్టించిన దురాభిప్రాయాన్ని అమిత్​ షా సెమినార్​ తొలగిస్తుందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి.

"ఎన్ఆర్​సీపై రాష్ట్రంలో భయాన్ని సృష్టించింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ సమస్యపై నెలకొన్న అన్ని రకాల దురాభిప్రాయాలు, భయాలను పోగొట్టేందుకు అమిత్​ షా పూర్తి స్థాయిలో వివరించనున్నారు. బంగాల్​లో ఓటు బ్యాంకుగా చూస్తోన్న బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను కాపాడేందుకే టీఎంసీ ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తోంది."

-భాజపా రాష్ట్ర సీనియర్​ నేత.

ప్రజల ఏర్పాట్లు..

బంగాల్​లో ఎన్​ఆర్​సీని చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్​ అధినేత్రి మమత బెనర్జీ ఎన్​ఆర్​సీని రాష్ట్రంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపడతారనే ప్రకటనతో ఇప్పటికే అక్కడి ప్రజలు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్​ ఆఫీసులకు పెద్ద ఎత్తున చేరుకుని జనన ధ్రువీకరణ సహా అవసరమైన పత్రాలను తీసుకుంటున్నారు.

అసోం ఎన్​ఆర్​సీపై...

ఎన్​ఆర్​సీ పునరుద్ధరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది టీఎంసీ. భాజపాను బెంగాలీ వ్యతిరేకిగా పేర్కొంది. అసోం ఎన్​ఆర్​సీ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులకు చోటు లభించకపోవటం పై అమిత్​ షా, భాజపా నాయకత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేశారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ.

ఇదీ చూడండి:ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశాలుగా గాంధీ సిద్ధాంతాలు

Last Updated : Oct 2, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details