తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ కేసు: సుప్రీంకోర్టులో కేంద్రం వ్యాజ్యం - latest nirbhya news

All convicts in Nirbhaya case have to be hanged together, says Delhi HC
కేంద్రానికి చుక్కెదురు.. పిటిషన్​ కొట్టివేత

By

Published : Feb 5, 2020, 2:51 PM IST

Updated : Feb 29, 2020, 6:46 AM IST

16:36 February 05

నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలు వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఉరి శిక్ష అమలుపై స్టేను హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసింది. 

15:26 February 05

కేంద్రానికి చుక్కెదురు.. పిటిషన్​ కొట్టివేత

కేంద్రానికి చుక్కెదురు.. పిటిషన్​ కొట్టివేత

నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. డెత్​ వారెంట్లపై స్టే విధించిన దిల్లీ పాటియాలా హౌస్​ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు నిరాకరించింది. శిక్ష అమలు జాప్యానికి చేసే ప్రయత్నాన్ని పరిగణనలోకి తీసుకుంది హై కోర్టు. వారంలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. అనంతరం నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని అధికారులకు నిర్దేశించింది. దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు కుదరదని, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. 

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడాల్సి ఉన్నా.. వారి పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున సరిగ్గా ఉరి అమలుకు ఒకరోజు ముందు డెత్​వారెంట్లపై స్టే ఇచ్చింది దిల్లీ పాటియాలా హౌస్​ కోర్టు. దీనిని సవాల్​ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. తాజాగా ఆ వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. 

14:46 February 05

నిర్భయ కేసు: కేంద్రం పిటిషన్​ కొట్టివేత

నిర్భయ కేసులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. దోషుల ఉరి నిలుపుదలను సవాల్​ చేసిన కేంద్రం పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల దోషుల పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున దిల్లీ పాటియాలా హౌస్​ కోర్టు ఉరి శిక్ష అమలుపై స్టే విధించింది. దీనిని సవాల్​ చేసింది కేంద్రం. తాజాగా ఆ పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 

Last Updated : Feb 29, 2020, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details