తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హాథ్రస్​ వ్యవహారాన్ని డబ్బుతో సెటిల్​ చేసేశాం కదా!'

హాథ్రస్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు.. రాజ్​వీర్ సింగ్ దిలేర్(భాజపా). సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న ఆ ఆడియో విన్నవారంతా ఇప్పుడు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇంతకీ, ఆ ఆడియో రికార్డులో ఏముంది..?

aligarh-bjp-mp- rajveer-singh- diler-viral-audio on hathras incident
హాథ్రస్ ఘటనపై ఎంపీ ఆడియో రికార్డు లీక్!

By

Published : Oct 3, 2020, 3:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్ హాథ్రస్ బాధితురాలికి న్యాయం చేయమని అడిగితే.. 'డబ్బుతో మ్యాటర్ సెటిల్ చేసేశాం' అంటున్నారు ఆ నియోజకవర్గ భాజపా ఎంపీ రాజ్​వీర్ సింగ్ దిలేర్. అత్యంత దారుణంగా హత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆ ఆడియో రికార్డు ఇప్పుడు వైరల్​గా మారింది.

ముంబయి కల్వాకు చెందిన ఓ వాల్మీకీ సమాజ్ నాయకుడు.. ఎంపీ రాజ్​వీర్​కు ఫోన్ చేశారు. హాథ్రస్ బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. వెంటనే.. 'ఆ మ్యాటర్ సెటిల్ చేసేశాం కదా. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలిచ్చి, ఓ ఇల్లు కట్టించి ఓ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించాం' అని బదులిచ్చారు. మరి, రాత్రికి రాత్రి యువతి మృతదేహాన్ని దహనం చేసిన పోలీసుల సంగతేంటీ? అని అడగగా.. 'పోలీసుల మీద మీరు చర్యలు తీసుకోండి?' అంటూ వింత సమాధానమిచ్చారు ఎంపీ.

హత్యాచార ఘటన బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది యోగి సర్కార్​. ఒక ఇల్లుతో పాటు కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'హాథ్రస్​'పై దద్దరిల్లిన దిల్లీ- నిరసనల్లో కేజ్రీ

ABOUT THE AUTHOR

...view details