తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయికి ఉగ్ర హెచ్చరికలు-అధికారుల అప్రమత్తం - drone attacks

పండుగల వేళ దేశ ఆర్థిక రాజధానిలో ఉగ్ర దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Alert in Mumbai amid possibility of terrorist attacks
ముంబయికి ఉగ్ర హెచ్చరికలు-అధికారుల అప్రమత్తం

By

Published : Oct 27, 2020, 12:51 PM IST

మహారాష్ట్రలోని ముంబయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. పండుగల వేళ.. దేశ ఆర్థిక రాజధానిలో ఉగ్రవాదులు క్షిపణి/ డ్రోన్​ దాడులు చేసే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ముంబయి పోలీసు శాఖ ఉత్తర్వులు

డ్రోన్లు, మైక్రోలైట్​ ఎయిర్​క్రాఫ్ట్​లను నిషేధించారు ముంబయి పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్టోబర్​ 30 నుంచి నవంబర్​ 28 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details