తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రోన్​లతో పాక్ కుట్రలు- భారత సైన్యం అప్రమత్తం - పాక్​ డ్రోన్లు

నియంత్రణ రేఖ వెంబడి హై అలర్ట్​ ప్రకటించింది భారత సైన్యం. సరిహద్దు వద్ద పాక్​ నిఘా సంస్థకు చెందిన డ్రోన్లను గుర్తించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్​లోని ఉగ్రవాదులకు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలను పాక్​ సరఫరా చేస్తున్నట్టు సైన్యం భావిస్తోంది.

Alert along LoC after ISI uses drones to drop weapons for terrorists
సరిహద్దులో డ్రోన్​ కలకలం- ఎల్​ఓసీ వెంబడి హై అలర్ట్​

By

Published : Sep 10, 2020, 5:03 PM IST

భారత్‌లోకి ఉగ్రవాదాన్ని ఎగవేయడంపై పాకిస్థాన్​ పన్నిన కుట్ర మరోసారి బయటపడింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్​‌ నిఘా సంస్థకు చెందిన డ్రోన్‌ను సైన్యం గుర్తించింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసేందుకే ఈ డ్రోన్‌ను వినియోగిస్తున్నట్లు సైన్యం అనుమానిస్తోంది.

తాజా సంఘటన నేపథ్యంలో డ్రోన్ల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్‌ పోస్టుల వద్ద ఉన్న తమ సిబ్బందికి సైన్యం సూచించింది. ఈ ఏడాది జూన్‌లో కూడా కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాకిస్థాన్​‌కు చెందిన ఓ డ్రోన్‌ను బీఎస్​ఎఫ్​ కూల్చివేసింది. ఈ డ్రోన్.. అత్యాధునిక తుపాకీ, ఏడు గ్రనేడ్లు, రేడియో సిగ్నల్‌, జీపీఎస్​ను తీసుకువచ్చింది.

జమ్ముకశ్మీర్‌లో పని చేస్తున్న ఉగ్రవాదులు తీవ్రమైన ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నారని సైన్యం తెలిపింది. అందుకే సరిహద్దుల అవతల నుంచి వాటిని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి:-భారత్​ను దెబ్బతీసేందుకు పాక్​ 'అణు' కుట్రలు!

ABOUT THE AUTHOR

...view details