బాలీవుడ్ అక్షయ్ కుమార్‌తో ప్రధాని నరేంద్రమోదీ మనసులో మాట పంచుకున్నారు. ఎన్నికల వేళ రాజకీయేతర అంశాలపై చర్చించారు. ప్రధాని అవుతానని తానెప్పుడూ ఊహించలేదని మోదీ చెప్పారు.
ప్రధాని నరేంద్రమోదీతో అక్కీ మాటామంతీ - ani
ప్రధాని నరేంద్రమోదీతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రాజకీయేతర అంశాలపై ముచ్చటించారు. వివిధ విషయాలపై అక్షయ్‌తో మనసులో మాటను పంచుకున్నారు మోదీ. విపక్ష నేతల్లోనూ మంచి మిత్రులున్నారని మోదీ తెలిపారు.
ప్రధానితో అక్కీ
విపక్ష నేతల్లోనూ మంచి మిత్రులున్నారని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చాలా దగ్గరి వారన్నారు.
తన మాటలను వక్రీకరిస్తారన్న భయం తనకు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు మోదీ.