తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధికార దుర్వినియోగంలో ఇద్దరూ ఒకటే' - BJP

సీబీఐ, ఈడీ వంటి సంస్థల దుర్వినియోగంలో భాజపా, కాంగ్రెస్​ ఒక్కటేనని విమర్శించారు ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమికే మెజార్టీ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమికి నష్టం చేకూర్చని రీతిలో అభ్యర్థులను నిలపామన్న కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు అఖిలేశ్​.

'అధికార దుర్వినియోగంలో ఇద్దరూ ఒకటే'

By

Published : May 2, 2019, 3:47 PM IST

Updated : May 2, 2019, 4:42 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమికే ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. కాంగ్రెస్​, భాజపాలకు ప్రజాదరణ లేదన్నారు. అఖిలేశ్​, మాయావతిల రిమోట్​ కంట్రోల్ ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఉందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలను తోసిపుచ్చారు.

మీడియాతో మాట్లాడుతున్న అఖిలేశ్​

"నాలుగు విడతల ఎన్నికల్లో కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయి. భాజపాకు ఎన్ని వస్తాయో తెలియదు. భాజపాకు, కాంగ్రెస్​కు పెద్ద తేడా ఏమీ లేదు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమి భాజపాను నిలువరించగలదు. ఈ విషయం తెలిసినా కాంగ్రెస్ నేరుగా భాజపాకు లాభం చేకూర్చాలని అనుకుంటోంది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా భయపెట్టడం కాంగ్రెస్ నుంచే భాజపా నేర్చుకుంది. కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పోటీలో దింపిందని అనడాన్ని నేను విశ్వసించను. ఏ రాజకీయ పార్టీ అలా చేయదు."
-అఖిలేశ్​ యాదవ్​, ఎస్పీ అధినేత

అంతర్గత దేశ భద్రతా ముఖ్యం

దేశ భద్రత సరిహద్దులోనే కాదు అంతర్గతంగానూ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరముందన్నారు అఖిలేశ్​. మావోయిస్టుల దాడుల్లో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: యూపీలో 'వ్యూహం'పై ప్రియాంక యూటర్న్!

Last Updated : May 2, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details