తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్పీ ప్రచారకర్తల జాబితాలో ములాయం గల్లంతు!

2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది సమాజ్​వాదీ పార్టీ. ఇందుకోసం ప్రధాన ప్రచారకర్తల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ములాయాం సింగ్​ యాదవ్​ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.

By

Published : Mar 24, 2019, 2:33 PM IST

Updated : Mar 24, 2019, 5:02 PM IST

ములాయంతో అఖిలేశ్

తండ్రిని పక్కన పెట్టిన తనయుడు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి సమాజ్​వాదీ పార్టీ సిద్ధమైంది. లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 40 మంది ప్రధాన ప్రచారకర్తలను ఎంపిక చేసింది. కానీ ఈ జాబితాలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్​కు చోటు కల్పించకుండా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

శనివారం ప్రచారకర్తల జాబితాను పార్టీ సీనియర్ నేత రామ్​గోపాల్ యాదవ్​ విడుదల చేశారు. ఇందులో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​, నాయకులు ఆజాం ఖాన్​, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ తదితరులు ఉన్నారు.

ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ ఆజాంఘడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎస్పీకి కలిసొచ్చిన మెయిన్​పురి స్థానం నుంచి ములాయం బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారు ములాయం.

బీఎస్పీతో పొత్తుతో ఉత్తరప్రదేశ్​లో 80 స్థానాలకు 37 చోట్ల ఎస్పీ పోటీ చేయనుంది. రాష్ట్రంలో ఏప్రిల్​ 11న మొదలయ్యే ఎన్నికలు మే 19 వరకు కొనసాగుతాయి.

ఇదీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

Last Updated : Mar 24, 2019, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details