బంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై మండిపడ్డారు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. ప్రధాని హోదాలో ఉండి 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారనటం సమంజసం కాదన్నారు. ఇలాంటి వారు ప్రచారం చేయకుండా 72 ఏళ్లపాటు ఈసీ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
"అభివృద్ధి అడుగుతోంది... మీరు ప్రధాని అవమానకరమైన ప్రసంగం విన్నారా? 125 కోట్ల మంది దేశ ప్రజల నమ్మకం కోల్పోయాక.. అనైతిక వాగ్దానాలు, 40 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారని మాట్లాడుతున్నారు.
ఈ వ్యాఖ్యల్లో మోదీ నల్లధనం మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయనపై 72 గంటలు కాదు.. 72 ఏళ్లు నిషేధం విధించాలి."