తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్సీపీ శాసనసభ పక్షనేతగా అజిత్​ పవార్​ తొలగింపు

ఎన్సీపీకి ఊహించని షాక్​ ఇచ్చిన అజిత్​ పవార్​ను శాసనసభ పక్షనేత పదవి నుంచి తొలగించింది ఆ పార్టీ. ఆయన స్థానంలో జయంత్​ పాటిల్​కు బాధ్యతలు అప్పగించింది. ముంబయిలోని వైబీ చవాన్​ కేంద్రంలో జరుగుతున్న పార్టీ ఎమ్మెల్యేల భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్సీపీ శాసనసభ పక్షనేతగా అజిత్​ పవార్​ తొలగింపు

By

Published : Nov 23, 2019, 8:44 PM IST

భాజపాతో చేతులు కలిపిన అజిత్​ పవార్​ను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది ఎన్సీపీ. శరద్​ పవార్​ నేతృత్వంలో ముంబయిలోని వైబీ చవాన్​ కేంద్రంలో సమావేశమైన శాసనసభాపక్షం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ కార్యక్రమానికి 50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారానికి రాజ్​భవన్​కు వెళ్లిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అజిత్​ పవార్​ పక్షాన ఉన్నారని ప్రచారం జరుగుతున్న ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంజయ్​ బాన్సోడ్​, బాబాసాహెబ్​ పాటిల్​లను శివసేన నేతలు సమావేశానికి తీసుకొచ్చారు.

జయంత్ పాటిల్​కు బాధ్యతలు..

అజిత్​ పవార్​ను శాసనసభ పక్షనేత పదవి నుంచి తొలగించిన ఎన్సీపీ.. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్​ నేత జయంత్ పాటిల్​కు అప్పగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఊహించని పరిణామాల మధ్య మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది భాజపా. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్​, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్​ పవార్​ ప్రమాణం చేశారు. అయితే.. అది అజిత్ వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్. భాజపాతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి: మహా : బాబాయ్‌ దీవెనలతో ఎదిగిన ‘దాదా’

ABOUT THE AUTHOR

...view details