భాజపాకు 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహారాష్ట్ర గవర్నర్‌కు అజిత్ పవార్ లేఖ సమర్పించినట్లు ఊహాగానాలున్నాయి. ఈ లేఖ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అత్యంత కీలకమైంది. ఫడణవీస్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును ఈ లేఖ ప్రభావితం చేయొచ్చు. మహారాష్ట్ర శాసనసభలోనూ దీనికి ప్రధాన్యం ఉంది. అయితే ఆ లేఖలో ఏముందనే విషయంపై స్పష్టత ఎవరికీ లేదు.
లేఖలో ప్రత్యక్షంగా ఏమీ లేదని.. ఎన్సీపి కార్యాలయ రిజిస్టర్లో తమ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో పాటు వారి పేర్లు, చిరునామాలే అందులో ఉండొచ్చని పార్టీ అధినేత శరద్ పవార్ ఇది వరకే అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయించే అధికారాన్ని అజిత్‌కు కట్టబెడుతున్నట్లు చేసిన తీర్మానమేదీ లేఖలో లేదని..అది చెల్లదని స్పష్టం చేశారు.