తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయండి' - national security adviser

కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్​ను ముమ్మరం చేయాలని ఆదేశించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. అక్కడి తాజా పరిస్థితులపై అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. భద్రత, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

'కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయండి'

By

Published : Sep 26, 2019, 6:44 PM IST

Updated : Oct 2, 2019, 3:08 AM IST

జమ్ముకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ శ్రీనగర్​లో అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.

కశ్మీర్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు డోభాల్. ఉగ్రసంస్థలకు భయపడకుండా ప్రజలు రోజువారీ కార్యకలాపాలు జరుపుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

కశ్మీర్‌ యాపిల్స్‌ ఇతర ప్రాంతాలకు రవాణ చేసే విషయంపైనా అధికారులతో చర్చించారు డోభాల్‌. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా సాధారణ పౌరులు, ఆస్తులకు ఎలాంటి నష్టం కలగరాదని తెలిపారు.

ఇదీ చూడండి: 'విక్రమ్'​ సమస్యల విశ్లేషణకు జాతీయ స్థాయి కమిటీ

Last Updated : Oct 2, 2019, 3:08 AM IST

ABOUT THE AUTHOR

...view details