కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అజయ్ కుమార్ లల్లు నియమితులయ్యారు. రాజ్ బబ్బర్ స్థానంలో అజయ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష పదవి సహా రాష్ట్ర కార్యవర్గంలో కీలక మార్పులు చేసింది కాంగ్రెస్. నలుగురు ఉపాధ్యక్షులు, 12 ప్రధాన కార్యదర్శలు, 24 కార్యదర్శుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది.
అజయ్ కుమార్ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన తమ్కుహి రాజ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఉత్తర ప్రదేశ్ తూర్పు ఇన్ఛార్జ్) ప్రియంకగాంధీకి సన్నిహితుడిగా అజయ్‌కుమార్‌కు పేరుంది.