హరియాణాలో జన్‌నాయక్ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలాకు రెండు వారాలపాటు పెరోల్ లభించింది. రేపు ఆయన తీహార్ జైలు నుంచి పెరోల్‌పై బయటకు రానున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతికి పాల్పడినందుకు అజయ్ చౌతాలా, ఆయన తండ్రి ఓం ప్రకాశ్ చౌతాలా 2013 నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
నిన్న జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా..... తన తండ్రి అజయ్ చౌతాలాను తీహార్ జైల్లో కలుసుకున్న అనంతరం ..... తమ పార్టీ మద్దతును భాజపాకి ప్రకటించారు.