సార్వత్రిక ఎన్నికల వేళ తృణమూల్ పార్టీ పేరు మారిందన్న వార్తలు సామాజిక, ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పార్టీ లోగో, బ్యానర్లు, గోడ పత్రికల్లో 'కాంగ్రెస్' అనే పదాన్ని తొలగించారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది.
పార్టీ పేరులో మార్పు లేదు : తృణమూల్ కాంగ్రెస్ - పశ్చిమ బంగ
పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలను ఖండించింది తృణమూల్. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరులో ఎటువంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది.

పార్టీ పేరుపై తప్పుడు వార్తలు నమ్మొద్దు: తృణమూల్
పార్టీ పేరుపై తప్పుడు వార్తలు నమ్మొద్దు: తృణమూల్
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద 1998 జనవరి 1న 'ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' రిజిస్టర్ అయింది. ఎన్నికల సంఘం ఆ పార్టీకి 'గడ్డి, పూలు' గుర్తును కేటాయించింది. ఆ తర్వాత మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.... బలమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.