ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాలను కస్టడీకి అప్పగించాలని దిల్లీ కోర్టును కోరాయి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ. ఈ కేసులో వారు విచారణకు సహకరించడం లేదని తెలిపాయి.
ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం, ఆయన కుమారుడు దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయొద్దని వీరి వినతికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి సీబీఐ, ఈడీ. కేసు దర్యాప్తునకు వారు ఆటంకం కల్గిస్తారని ఆరోపించాయి.
వాదనలు విన్న దిల్లీ న్యాయస్థానం తీర్పును ఈ నెల ఐదుకు వాయిదా వేసింది.