తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరానికి ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో ఊరట

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఎయిర్​సెల్​-మ్యాక్సిస్ కేసులో ఊరట లభించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దిల్లీలోని ప్రత్యేక కోర్టు వారిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

చిదంబరానికి ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో ఊరట

By

Published : Sep 5, 2019, 2:42 PM IST

Updated : Sep 29, 2019, 1:03 PM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎయిర్​సెల్​-మ్యాక్సిస్​ కేసులో ఊరట లభించింది. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీకి సీబీఐ, ఈడీ కేసుల్లో దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది.

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో చిదంబరం, కార్తీ అభ్యర్థనపై ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. లక్ష రూపాయల పూచీకత్తుపై ముందస్తు బెయిల్​ ముంజూరు చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణకు సహకరించాలని చిదంబరాన్ని ఆదేశించారు.

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్​సెల్​, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరం ఇప్పటికే అరెస్టయ్యారు.

ఇదీ చూడండి: 'శ్రీనగర్​కు ముఫ్తీ కుమార్తె... దిల్లీకి తరిగమి'

Last Updated : Sep 29, 2019, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details