రాంచీ విమానాశ్రయంలో ఎయిర్ఏషియా విమానం ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. ముంబయి వెళ్లడం కోసం టేకాఫ్ చేస్తుండగా.. ఓ పక్షి విమానాన్ని ఢీకొంది. ఈ నేపథ్యంలో టేకాఫ్‌ను నిలిపివేశారు పైలట్లు.
"ఎయిర్ఏషియా ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-హెచ్కేజీ ఫ్లైయిట్ ఐ5-632 రాంచీ నుంచి ముంబయికి వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 8, 11:50గంటల సమయంలో టేకాఫ్ చేస్తుండగా విమానాన్ని ఓ పక్షి ఢీకొంది."