వాయు కాలుష్యం.. గుండె, ఊపిరితిత్తులకే కాదు.. కళ్లకు కూడా చేటేనని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. కలుషితమైన గాలి కారణంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, అది ఎప్పటికీ తిరిగిరాదని స్పష్టం చేస్తోంది.
చూపు కోల్పోయిన అనంతరం దానిని దక్కించుకోలేని పరిస్థితిని ఏజ్ రిలేటెడ్ మాకులర్ డీజెనరేషన్(ఏఎండీ) అంటారు. ధనిక దేశాల్లో ఉన్న వయోధికుల్లో ఈ తరహా వ్యాధులు ఎక్కువగా వస్తాయని పరిశోధకులు వెల్లడించారు. 2040 నాటికి ఏఎండీ బాధితుల సంఖ్య 30 కోట్లు దాటుతుందని అంచనా.