తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ... తక్షణం అత్యవసర పరిస్థితి విధించండి'

బంగాల్ నుంచి పంజాబ్​ వరకు వీలైనంత త్వరగా జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిని అమలు చేయాలని ప్రధాని మోదీకి  విజ్ఞప్తి చేశాయి వాతావరణ పరిరక్షణ సంస్థలు. ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరాయి.

Air pollution: Environmental organisations urge PM to declare national health emergency
'కాలుష్య కోరల్లో ఉత్తర భారతం.. అత్యయికస్థితి అమలు చేయండి'

By

Published : Dec 12, 2019, 6:59 PM IST

Updated : Dec 12, 2019, 9:29 PM IST

ఉత్తర భారతంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిందిగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాయి పలు వాతావరణ పరిరక్షణ సంస్థలు. బంగాల్​ నుంచి పంజాబ్​ వరకు రెండు-మూడు రోజులుగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని వెల్లడించాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే విషవాయువుల తీవ్రత మరింత పెరిగినందున ప్రధానితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి.

పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించే కేర్​ ఫర్​ ఎయిర్​, మై రైట్​ టు బ్రీత్, చింతన్ వంటి సంస్థలు "ద క్లీన్​ ఎయిర్​ కలెక్టివ్​" పేరిట ఒకే గొడుగు కిందకు వచ్చి మోదీకి ఈ విజ్ఞప్తి చేశాయి.

'ఉత్తరాదిన దయచేసి జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అమలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కోరుతున్నాం. వ్యర్థాలు, బయోమాస్​ దహనంపై ఇప్పటికే ఉన్న చట్టాలను కచ్చితంగా అమలు చేయండి. కాలుష్య కారకాలను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన అవసరముంది.'
-ద క్లీన్​ ఎయిర్​ కలెక్టివ్

సగటు పౌరుడికి ఇబ్బంది

ఉత్తరాది ప్రాంతమంతా హానికర వాయు నిలయంగా మారిందన్నారు 'ద క్లీన్​ ఎయిర్ కలెక్టివ్' సభ్యులు. ఇంత తీవ్రమైన కాలుష్యం.. సగటు పౌరుడి ఊపిరి పీల్చుకునే హక్కుకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి:'పౌర' ఆగ్రహం: ఈశాన్యంలో నిరసనలు హింసాత్మకం

Last Updated : Dec 12, 2019, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details